మీటింగ్ వల్ల వివాదానికి శుభం .. చిరుకు సాధ్యం కానిది దిల్ రాజుకు సాధ్యమైందా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు టాలీవుడ్ సెలబ్రిటీలు కలవనున్న సంగతి తెలిసిందే. ఎఫ్.డీ.ఏ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజు జోక్యం చేసుకోవడం వల్ల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. బన్నీ వివాదానికి సైతం శుభం కార్డ్ పడినట్లేనని ప్రభుత్వం వైపు నుంచి విమర్శలు ఉండబోవని తెలుస్తోంది. సర్కార్ తో సినీ పెద్దల భేటీ వల్ల భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీకి మరింత మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంది.
సంక్రాంతి సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఈ మీటింగ్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్ల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో ఆ కుటుంబం కేసు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సీఎంతో మీటింగ్ వల్ల వివాదానికి శుభం కార్డ్ పడనుండటం సినీ అభిమానులకు సైతం ఒకింత సంతోషాన్ని కలిగిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు మేలు జరిగే విధంగా ఏవైనా నిర్ణయాలను ప్రకటిస్తారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
అయితే వివాదాన్ని పరిష్కరించడం చిరంజీవికి సాధ్యం కాకపోయినా దిల్ రాజుకు సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డితో దిల్ రాజుకు ఉన్న పరిచయాలు ఇండస్ట్రీకి మేలు చేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సైతం కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే సంచలన విజయాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. దిల్ రాజు సైతం తెలివిగా వివాదాలకు చెక్ పెట్టే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్, ఏపీ సర్కార్ సపోర్ట్ తో టాలీవుడ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.