పవన్ కోసం బాలయ్య.. అలాంటి త్యాగం చేయాలి అంటే గట్స్ ఉండాలి..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలయ్య తన కెరీర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాల కథ నచ్చిన కూడా తనపై ఆ సినిమా వర్కౌట్ కాదు అని వేరే వాళ్లపై అది అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అనే ఉద్దేశంతో వేరే వాళ్ల పేరును సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలా ఓ సినిమా విషయంలో బాలయ్య , పవన్ కళ్యాణ్ పేరు సూచించగా పవన్ కళ్యాణ్ తోనే మేకర్స్ మూవీ ని నిర్మించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుందట. ఆ సినిమా ఏది ..? అసలు ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా భీమ్లా నాయక్ అనే సినిమా రూపొంది మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా ఓ మలయాళ మూవీ కి అధికారిక రీమేక్. ఈ సినిమాలో మొదటిగా పవన్ కళ్యాణ్ పాత్రలో నాగ వంశీ , బాలకృష్ణ ను అనుకున్నారట. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి ఈ మూవీ కథను కూడా వివరించాడట.

కథ మొత్తం విన్న బాలయ్య కథ సూపర్ గా ఉంది. కానీ నాపై కథ అస్సలు వర్కౌట్ కాదు. ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే అద్భుతంగా ఉంటుంది అని సూచించాడట. నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా ఆయన ఈ రీమేక్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా పవన్ కి మంచి విజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: