పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..?

Divya
జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమేడియన్గా పేరు సంపాదించిన వారిలో జబర్దస్త్ మహీధర్ కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని అలరించిన మహీధర్ రైటర్ గా, టీమ్ లీడర్ గా కూడా పేరు సంపాదించారు. అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అందులో బిగ్ బాస్ రివ్యూలతో పాటు సినిమాలకు సంబంధించిన రివ్యూలు పలు రకాల ఇంటర్వ్యూలతో యూట్యూబ్లో భారీగానే వ్యూస్ సంపాదించారు. అలాగే ఒక కేఫ్ కూడా రన్ చేస్తున్నారు మహీధర్.

తాజాగా ఈ కమెడియన్ వివాహం చేసుకున్నట్లుగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది మహీధర్. ఈ ఫోటోలు చూసిన అభిమానులు , నెటిజన్స్, సినీ సెలబ్రిటీలు జబర్దస్త్ నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి ,చంద్రకళ, మహీధర్ ఇద్దరు కూడా గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మహీధర్ స్వయంగా తెలియజేశారు.



ఇమే వైజాగ్ యూనివర్సిటీలో చదివే సమయంలోనే ప్రేమలో పడ్డారట మహీధర్. తన యూట్యూబ్ ఛానల్ కి మొట్టమొదట సబ్ స్క్రైబర్ అని, తన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ తన వీడియోలను చూసేదని తన వీడియోలు అన్నీ కూడా బాగున్నాయంటు ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇచ్చేదని తెలిపారు. అలా పుట్టినరోజుకు, పండగలకు ఎక్కువగా మెసేజ్లు చేసేదని తాను వైజాగ్ లో ఉండేవాన్ని ఇద్దరం బయట చాలాసార్లు కలిసాము. ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో మా పరిచయం ప్రేమగా మారిందని అలా 2019 నుంచి మేము ప్రేమలోనే ఉన్నాము. మా వివాహానికి కూడా ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నారని మహీధర్ ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: