ఏపీ: పార్టీ మార్పుపై.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన వైసిపి మహిళా ఎంపీ..!

Divya
ఆంధ్రాలో వైసీపీ పార్టీ 2024 లో అధికారం కోల్పోగానే ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేతలు, ఎంపీలు ఎమ్మెల్సీలు సైతం కూటమి పార్టీలోకి చేరారు. అలా చేరిన వారందరూ కూడా కూటమిలో ఇమడలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలు నియోజవర్గాలలో వినిపిస్తున్నాయి. మరొకవైపు వైసీపీలో కీలకమైన నేతలు ఇతర పార్టీలలోకి వెళ్ళబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అలా వైసిపి పార్టీ మహిళా నేత మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా వైసిపి పార్టీను విడి జనసేన మీద బిజెపి పార్టీలో చేరుతుందని ప్రచారం గత కొద్దిరోజులుగా విస్తృతంగా జరుగుతొంది.



అయితే ఈ విషయం పైన తీవ్రంగా స్పందించిన బుట్టా రేణుక, తన మీద కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఈ వ్యాఖ్యలను ఖండించింది. రాజకీయంగా తనని ఎదురుకోలేక ప్రజలలో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. తనమీద ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసిన వారే రాబోయే రోజుల్లో ప్రజల ముందు నవ్వుల పాలవుతారు అంటూ ఆమె వ్యాఖ్యానించింది. 2019లో వైసీపీ పార్టీలో తిరిగి చేరిన తర్వాత ఎలాంటి ఆశలు పదవులు ఆశించకుండానే కేవలం పార్టీ కోసమే పనిచేశానట్టు తెలియజేసింది బుట్టా రేణుక.

ఇప్పుడు మళ్లీ తిరిగి పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ తెలిపింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తనకి ఉన్న అపారమైన నమ్మకం  ఆయన న్యాయకత్వంలో పనిచేస్తూ కొనసాగించడమే తనకు నచ్చుతుందని తెలియజేసింది బుట్టా రేణుక. వైసిపి పార్టీని విడిచి వెళ్లాల్సి వస్తే అది తన రాజకీయ జీవితానికి చివరి రోజు అవుతుందంటూ ఆమె పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో తన మీద వస్తున్న అన్ని రూమర్స్ కి సమాధానాలకు  ఇలా ఒక్క మాటతో చెక్ పెట్టేసింది. దీంతో వైసిపి కార్యకర్తలు, నేతలు కూడా సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: