కేసీఆర్, తను ఓడినందుకు ఏడ్వలేదు కానీ వారిని నమ్మినందుకు మాత్రం చాలా బాధపడిండు?
* ఆరోజు కెసిఆర్ ఆహారమే ముట్టలేదట!
*అదే పెద్ద జోక్!
(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
దాదాపు దశాబ్దకాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన కెసిఆర్, గడిచిన ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని ఉహించి ఉండడు. తనకు ఎదురులేదు... కాంగ్రెస్ కి అంత సీన్ లేదు.. సీఎం కావడం అనేది రేవంత్ రెడ్డి వళ్ళ కాదు కదా.. ఆని అబ్బ వలన కూడా గాదు! అని అనుకున్న కెసిఆర్ కి తెలంగాణ ప్రజలు ఊహించని ఝలక్ ఇచ్చారు. అవును, మార్పును కోరుకున్నారేమో తెలియదు కానీ, తెలంగాణ జనాలు దశాబ్దకాలం కెసిఆర్ పాలన తరువాత రేవంత్ రెడ్డికి కిరీటం తొడిగారు. మరీ ముఖ్యంగా తెలంగాణలోని పల్లెటూళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటు వేసాయి. కేవలం హైదరాబాద్ నగరం మీద ఫోకస్ చేసిన కెసిఆర్ ప్రభుత్వం పల్లె వాసులను, రైతులను పట్టించుకోకపోవడంతో సీఎం సీటునుండి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఇక ఓటమి ఎప్పుడైనా తప్పదు అని రియలైజ్ అయిన కెసిఆర్ ఆ తరువాత క్రమంలో పార్టీని బలపరుచుకునే పనిలో మునిగిపోయాడు. అక్కడే కెసిఆర్ కి ఊహించని షాకులు ఎదురయ్యాయి. అవును, కెసిఆర్ ఎవరినైతే బాగా నమ్మాడో, మరి ఎవరైతే తాను నమ్మిన బంటు అని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడో.. వారందరూ వరుసగా బీఆర్‌ఎస్ పార్టీని వీడి వెళ్లడం మొదలు పెట్టారు. ఎన్నికల్లో ఓటమికి కూడా క్రుంగని కెసిఆర్, తనకి అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన కొంతమంది తనని వీడి వెళ్లడంతో జ్వరం పెట్టుకున్నాడు.
అవును, మొదట బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది సాధారమైన షాక్ కాదు. ఈ పరిణామం తరువాత కెసిఆర్ ఈ చేరికపైన అస్సలు కామెంట్ కూడా చేయలేకపోయాడు. కానీ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ మాత్రం పోచారంని ప్రశ్నించారు. ఎంతో గౌరవమిచ్చిన కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన కార్యం జరిగిపోయింది. పోచారం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు మరి!
ఈ కోవకే చెందుతారు స్టేసన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈయనైతే ఏకంగా బీఆర్ఎస్ లో ఇంకా ఉండి కేసీఆర్ ను మోసం చేయలేను... వెన్నుపొడవలేకనే పార్టీ మారుతున్నానని చెప్పి మరీ పార్టీ మారిన ఘనత ఈయనదే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదంటూ కెసిఆర్ ని వంచించి, కాంగ్రెస్ పంచన చేరాడు. పదవిలో ఉండి పార్టీ మారడంపై రాబోయే రోజుల్లో చట్టం ప్రకారం నడుచుకుంటామని చెబుతూ వేదాలు వల్లించాడు. అక్కడితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని పదేళ్లుగా సూచిస్తున్నా.. పట్టించుకోలేదు అని నిందలు మోపుతూ కండువాని మార్చేశాడు. ఇలాంటి షాకుల తరువాత కెసిఆర్ భవిష్యత్ పార్టీ కార్యాచరణాలను చాలా పగడ్బందీగా చేసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాస్త ఏమరుపాటుతనంతో ఉండడం వలన ఎంతటి నష్టం జరిగిందో అని గ్రహించిన కెసిఆర్ సమీప భవిష్యత్తులో మాత్రం తెలంగాణాలో శాశ్వతంగా జెండాను ఎగురవేయాలని యోచిస్తున్నాడు.