ఏపీ: గుడ్ న్యూస్ అంటే ఇది..పింఛన్ కుటుంబాలకు చంద్రబాబు వరం...!
పింఛన్దారులకు ప్రతినెలా కూడా స్వయంగా ఏదో ఒకచోట చంద్రబాబు వెళ్లి అందిస్తున్నారు. అలాగే కూటమినేతలు కూడా ఒకటవ తారీఖు పింఛన్ ని అందించేలా పలు ప్రాంతాలలో కూడా పంపిణీ చేయడంలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మూడు నెలలకు పింఛను తీసుకోకపోయినా వాటిని రద్దు చేయకూడదని ఒకేసారి మూడు నెలల మొత్తాన్ని కూడా పింఛన్దారులకు అందించే విధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.. పించిని తీసుకునే దారులు ఎవరైనా ఆ కుటుంబంలో మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి పింఛని మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నదట కూటమి ప్రభుత్వం.
ఇది పింఛన్దారుల కుటుంబానికి ఒక వరమని కూడా చెప్పవచ్చు. పింఛన్దారులు మరణిస్తే ఆ మరుసటి నెల నుంచి ఆ కుటుంబంలో సభ్యులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కుటుంబంలో భర్త మరణిస్తే భార్యకు అదే మొత్తాన్ని అందించేలా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. అలాగే పింఛన్లను ఏరివేస్తారని వార్తలలో ఎలాంటి నిజము లేదని కూడా వాటిని ఎవరూ నమ్మవద్దండి అంటూ తెలిపారు. అనర్హుల జాబితాలను మాత్రమే జాబితాల నుంచి తొలగిస్తామని అర్హులైన వారికి ప్రభుత్వం తరఫున పించని మంజూరు చేస్తామంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. మొత్తానికి పింఛన్ వ్యవహారంలో పింఛన్దారుల కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు.