ప్రభాస్ కి అసలు హీరో అవ్వడం ఇష్టం లేదా..? ఆ ఫిల్డ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నాడా..?
వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ అదే విషయాన్ని గుర్తు చేసుకొని ప్రభాస్ తో ఫన్నీగా అటుపట్టిస్తూ ఉంటారట . కాగా ప్రభాస్ కి సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అన్న ఆలోచన కలిగింది మాత్రం కృష్ణంరాజు గారి వల్లే అట. కృష్ణంరాజు గారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ..ఆయనను అభిమానులు ఎలా ఆరాధిస్తున్నారో చూసి .. మనం కూడా హీరో అయితే ఇలా మనల్ని అభిమానిస్తారా..? ఆరాధిస్తారా..? అంటూ హీరో అవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట .
అంతకుముందు వరకు ప్రభాస్ అసలు హీరో అవ్వడమే ఇష్టం లేనట్టు బిహేవ్ చేశారట . సయాన కృష్ణంరాజు , ప్రభాస్ తండ్రి అడిగినా కూడా నేను హోటల్ పెడతాను.. పెద్ద బిజినెస్ చేస్తాను అని చెప్పుకొచ్చే వారట . కానీ ప్రభాస్ తలరాతలో ఎప్పుడు ఆయన స్టార్ హీరో అవ్వాలి అని ..పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకోవాలని రాసేసింది. అందుకే ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అయ్యాడు.
ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న కూడా మార్కెట్ ఏ మాత్రం తగ్గకపోవడం .. అదేవిధంగా స్టార్ స్టేటస్ ఫ్యాన్ ఫాలోYఇంగ్ ఇంకా పెరిగిపోతూ ఉండడం గమనార్హం . అలా ఒక పెద్ద బిజినెస్ మాన్ అవ్వాల్సిన హీరో ప్రభాస్.. ఇప్పుడు మన ఇండస్ట్రీలో తోపైన హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగించుకున్న హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . లక్ అంటే ఇదే కాబోలు . ప్రభాస్ బర్త డే సందర్భంగా ఆయనకు సంబంధించిన ఇదే విషయాన్ని బాగా గుర్తు చేసుకొని ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు..!!