అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు.. నేను అన్నది ఒకటి.. చూపించింది ఒకటి.. నాగ వంశీ..!

frame అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు.. నేను అన్నది ఒకటి.. చూపించింది ఒకటి.. నాగ వంశీ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఈయన వచ్చే సంక్రాంతికి పెద్దగా పోటీ ఉండదు అని అన్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ.ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ అలాగే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఇకపోతే వచ్చే సంక్రాంతికి పెద్దగా పోటీ ఉండదు అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీనితో ఈ సినిమాల ద్వారా ఏమి పోటీ లేదు అనే విధంగా నాగ వంశీ వ్యాఖ్యలు చేశాడు అని చాలా మంది వైరల్ చేస్తున్నారు. దానితో తాజాగా దీనిపై నాగ వంశీ స్పందిస్తూ ... నేను చాలా పెద్దగా దాని గురించి మాట్లాడాను. కానీ అందులో ఒక చిన్న విషయాన్ని కట్ చేసి వైరల్ చేస్తున్నారు.

అసలు ఆ ఇంటర్వ్యూలో జరిగింది ఏమిటి అంటే ... ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు దాదాపు 6 సినిమాలు విడుదల అవుతాయి. దాని వల్ల పెద్ద స్థాయిలో పోటీ ఉంటుంది అని అన్నాడు. దానితో నేను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకు 6 సినిమాలు విడుదల కావు. కేవలం మూడు సినిమాల వరకు మాత్రమే విడుదల అవుతాయి. అందువల్ల పెద్ద పోటీ ఉండదు అన్నాను. నేను ఒక వర్షన్ లో అన్న దానిని మరొక వర్షన్ లో జనాల ముందుకు తీసుకు వెళ్లి నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: