ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నిరుద్యోగ భృతి అర్హతలివే..!
ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామంటూ వెల్లడించిన కూటమి ప్రభుత్వం తాజాగా ఈ పథకం గురించి అధికారులతో చర్చిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చర్యలను ,అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. ప్రతినెల నిరుద్యోగులకు 3000 రూపాయలు పొందాలి అంటే అర్హతలు ఏంటనే విషయాన్ని కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉన్న వారికి మాత్రమే ఇందుకు అర్హులట. అలాగే ప్రతినెల పదివేల రూపాయలకు మించి ఆదాయం ఉండకూడదట.. ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా కోర్సులను పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులంటూ సమాచారం.
అలాగే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కి మాత్రమే అర్హులట. అలాగే కుటుంబంలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని వారు పెన్షన్ కూడా తీసుకోకూడదని తెలియజేస్తున్నారు. ఇతర ప్రభుత్వ పథకాల నుంచి కూడా లబ్ధి పొందకూడదని తెలియజేస్తోంది. ఇలాంటి వారే నిరుద్యోగ భృతికి అర్హులని తెలిపారు .ఇలా ఎన్నో అర్హతలను తెలియజేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే ఏపీ ప్రభుత్వం తెలియజేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన నిరుద్యోగులు కాస్త ఆనందపడుతున్నప్పటికీ ఈ పథకాన్ని ఎప్పుడు అప్లై చేస్తారా అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారు.