సినిమాల్లోనే కాదు ఇకపై సీరియల్ లోను అలా చేయకూడదు.. గవర్నమెంట్ కీలక నిర్ణణం..!?
అన్ని సినిమాలలో అలా ఉంటాయి అని చెప్పలేం కానీ కొన్ని కొన్ని సినిమాలలో మాత్రం పచ్చి బూతులు ఓవర్గా చూపిస్తున్నారు కొంతమంది దర్శకులు . సినిమా విధివిధానాలను కూడా మర్చిపోతున్నారు . అయితే మరీ ముఖ్యంగా డ్రగ్స్ ని ఎక్కువగా సినిమాలు చూపించడం వల్ల యువత చెడిపోతుంది అంటూ రీసెంట్ గానే తెలంగాణ ప్రభుత్వం సినిమాలలో డ్రగ్స్ కి సంబంధించిన ఎటువంటి నెగిటీవ్ సీన్స్ ఉండకూడదని .. యువతను డ్రగ్స్ తీసుకునే విధంగా ప్రోత్సహకరించే విధంగా సీన్స్ తెరకెక్కించకూడదు అంటూ కండిషన్ పెట్టారు .
అంతేకాదు సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రతి హీరో కూడా డ్రగ్స్ అవేర్నెస్ వీడియో చేయాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు . అయితే ఇది కేవలం సినిమాలకే కాదు సీరియల్ కి కూడా వర్తిస్తుంది అంటున్నారు పెద్ద మనుషులు . ఈ మధ్యకాలంలో సీరియల్స్ కూడా బాగా ఎక్కువగా ఫేమస్ అయిపోతున్నాయి . సినిమా అంటే కేవలం 3 గంటలు .. అదే సీరియల్ అంటే మూడు నాలుగు ఏళ్ళు టీవీలో చూస్తూనే ఉంటారు జనాలు . ఆ కారణంగానే డ్రగ్స్ అవేర్నెస్ వీడియోస్ సీరియల్ హీరోస్ కూడా చేయాలి అని సీరియల్స్ లో కూడా డ్రగ్స్ ప్రమోట్ చేసే విధంగా సీన్స్ తెరకెక్కించకూడదు అంటూ గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్ పెట్టబోతుందట . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!