సంక్రాంతి సినిమాల ప్రమోషన్లలో ఏపీ మంత్రులు... ?
సంక్రాంతి సినిమాల సందడికి రంగం సిద్ధం అయింది . వరుస పెట్టి రెండు రోజుల తేడా లో సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ముందుగా ఈ నెల 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ - ఆ తర్వాత 12న బాలయ్య డాకూ మహారాజ్ - 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ల ప్రమోషన్ల లో ఏపీ మంత్రులు బిజీ గా ఉన్నారు. ఆ మాటకు వస్తే కీలక మంత్రులు ఈ సినిమా ప్రమోషన్ల లో బిజీ అవుతున్నారు. రాజమహేంద్ర వరం లో జరిగిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అథితి గా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ ను పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేశారు. అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాలని కామెంట్స్ చేశారు.
ఇక ఇప్పుడు బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ వంతు వచ్చింది. వాస్తవంగా ఈ సినిమా ఈవెంట్ కు బాలయ్య అల్లుడు .. ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అథితిగా హాజరు కావాల్సి ఉంది. గురువారం అనంతపురం లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే తిరుపతి లో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడంతో ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. అంతతకు ముందే అమెరికా లోని డల్లాస్ లో జరిగిన డాకూ మహారాజ్ ప్రి రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా గుంటూరు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మరీ ఈ సినిమా ను ఆకాశానికి ఎత్తుతూ ప్రమోట్ చేశారు. పెమ్మసాని ని పక్కన పెట్టేస్తే ... అబ్బాయి సినిమాకు బాబాయ్...మామ సినిమాకు అల్లుడు ప్రోమోషన్స్ చేస్తున్నట్లు చెప్పొచ్చు. మొత్తానికి సంక్రాంతి సినిమా లకు ఏపీ మంత్రుల ప్రమోషన్ల జోరు మామూలుగా లేదు.