నేను పెళ్లి చేసుకునేది అప్పుడే.. విజయ్ దేవరకొండ హీరోయిన్ కామెంట్స్ వైరల్?
ఇక విజయ్ తో కలిసి 'లైగర్' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న అనన్య పాండే గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. సినిమా ఫలితం కాస్త తేడా కొట్టడంతో విజయ్ అభిమానుల కోపానికి హీరోయిన్ అనన్య బలైన సంగతి తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే... అనన్య "వాకర్ బ్లాంకో"తో డేటింగ్ చేస్తున్నారనే సంగతి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా ఘోషిస్తోంది. ఈ తరుణంలోనే ఆమె తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "అందరిలాగే నాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. తప్పకుండా పెళ్లికి ముందు ఒక కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఆ ఇంటి నిండా ఎక్కువ కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం సంగతి చూస్తా!" అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు గత కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ హాజరైన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సందర్భంగా ఆమె ఇంకో ఆసక్తికరమైన అంశం కూడా చెప్పుకొచ్చారు. అనన్య రాబోయే ఐదేళ్లలో వివాహం చేసుకోవాలని మరియు పిల్లలను ప్లాన్ చేయడం కూడా ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.