తిరుపతి విషాదం... విచారణలో ఏం తేలుతోంది... !
గత రాత్రి తిరుమల తిరుపతిలో జరిగిన విషాద ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట లో ఆరుగురు భక్తులు మృతి చెందారు. సుమారు 40 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టిటిడి ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన చాలా దురదృష్టకరమైన చెప్పారు. మొత్తం 41 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని ... ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతుందని శ్యామల రావు పేర్కొన్నారు. డిఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్టు ప్రాథమికంగా విచారణలో తేలినట్టు ఆయన స్పష్టం చేశారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.
ఇక గాయపడిన వారి కి ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జ్ చేసినట్టు కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతోన్న వారి లో ఎవ్వరికి ప్రాణాపాయం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలు అయ్యాయని ... వీరికి కూడా చికిత్స అందిస్తున్నామన్నారు. తిరుపతి లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు కాస్త అదుపు లోకి వచ్చింది. ఇక తొక్కిసలాట ఘటన తర్వాత డీఎస్పీ తో పాటు అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని తేలినట్టు తెలుస్తోంది. డీఎస్పీ తీరు పై ఎస్పీ సుబ్బారాయుడు ఇప్పటికే నివేదిక తెప్పించు కుని కలెక్టర్ కు అందజేసినట్టు కూడా సమాచారం. ఇక అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రమాదం జరిగిన 20 నిమిషాల వరకు అందుబాటు లోకి రాలేదట.