ఇప్పుడైనా థియేటర్లకు ఫ్యామిలీలు వస్తాయా ?.. సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటి..?

Amruth kumar
ప్రధానంగా సినిమా థియేటర్ల వద్ద ఉండే ఫుట్ ఫాల్స్ గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది .. ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు రావడ‌మే మానేశారని దాంతో థియేటర్లో హౌస్ ఫుల్ అవ్వ‌డ‌మే లేదని నిర్మాతలు వాపోతున్నారు .. ఇక దానికి ఓ కారణం కూడా ఉంది టికెట్ రేట్లు బాగా పెంచడం కారణంగా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు .. ఎలాగో కొన్ని రోజులాకి  ఓటీటీలో సినిమా వస్తుంది కదా అని లైట్ తీసుకుంటున్నారు .. టికెట్ రేట్లు పెంచడం కేవలం ఓ కారణం మాత్రమే అని సినిమా బాగుంటే తప్పకుండా ఫుట్ పాల్స్ పెరుగుతాయని ఓ వర్గం గట్టిగా వాదిస్తుంది .. ఈ రెండు  వాద‌న‌ల్లో ఏది బలమైనదో ఈ సంక్రాంతి సినిమాలు తేల్చబోతున్నాయి ..

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలు రాబోతున్నాయి .. మూడిటి పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి .. ఇక ఏదైనా పెద్ద సినిమా వస్తుంది అంటే సాధారణంగా టికెట్ రేట్ లు పెంపు కోసం ప్రభుత్వాలు అనుమతులుు ఇస్తాయి .. ఇక ఏపీలో ఇప్పటికే ఈ ఉత్తర్వులు వచ్చేసాయి .. తెలంగాణలో కూడా హైక్‌ చేశారు .. ఏపీతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ .. రిలీజ్ అయిన తర్వాత నుంచి టికెట్ రేట్లు మరింత  తగ్గిస్తారు .. డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకైతే తెలంగాణలో సాధారణమైన టిక్కెట్ రేట్లు ఉన్నాయి .. కల్కి , దేవ‌ర , పుష్ప2 టికెట్ రేటుతో పోలిస్తే ఈ ధరలు మధ్యతరగతి ప్రేక్షకులకి  పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్టే అనిపిస్తున్నాయి.  

ఇక మరి ఇప్పుడైనా ఫుట్ పాల్స్  పెరుగుతాయా ? తెలంగాణలో పోలిస్తే ఏపీలో టికెట్ రేట్లు కొంచెం ఎక్కువ సినిమా బాగుంది ఏపీలో ఫుట్ ఫాల్స్ తక్కువగా , తెలంగాణలో ఎక్కువగా ఉంటే అదంతా టికెట్ రేట్ లో ప్రభావం అనుకోవాలి .. రెండు చోట్ల ఒకేలా కనిపిస్తే మాత్రం అసలు టిక్కెట్ ధరలకు ఫుట్ పాల్స్‌ కు సంబంధమే లేదని అర్థం చేసుకోవాలి . ఇక తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంపు విషయంలో కాస్త ఇబ్బంది పడే సినిమా మాత్రం గేమ్ చేంజర్ ఒకటే .. ఎందుకంటే భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఇది మొదటి వారంలోనే అనుకున్న కలెక్షన్లు రావాలంటే ఖచ్చితంగా టిక్కెట్ రేట్లు పెంచుకోవడం ఎంతో అవసరం .. అయితే ఈ విషయంలో దిల్ రాజు కాస్త గట్టిగానే పోరాడినట్లు తెలుస్తుంది .. కానీ ఫలితం రాలేదు అర్ధరాత్రి 1:00 షో కోసం కూడా దిల్ రాజు ప్రయత్నించారు .. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు .. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కలెక్షన్లపై గట్టిగా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: