ఏంటి సమంత కారణంగా అమలాపాల్ జీవితం నాశనం అయిందా.. అసలు వీరిద్దరికీ మధ్య సంబంధం ఏంటి.. అమలాపాల్ విడాకులకు కారణం సమంత ఎలా అయింది అనేది ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ సమంత నాగచైతన్య ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.అయితే సమంత విడాకులు అయ్యాక ఆమె పేరును చాలా విషయాల్లో వాడారు.అలా నిహారిక విడాకుల్లో, శ్రీజ విడాకుల్లో కూడా ఈమె పేరును ఉపయోగించారు. వీరిద్దరే కాదు హీరోయిన్ అమలాపాల్ విడాకుల్లో కూడా సమంత పేరు వినిపించింది.దానికి ప్రధాన కారణం సమంత చేసిన తప్పే అని తెలుస్తుంది.ఇక సమంత చేసిన తప్పేంటయ్యా అంటే.. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ని మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో సినిమాలో నటిస్స్తాను కానీ ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమాల్లో చేయను అని ఒప్పుకుందట.
కేవలం సాంప్రదాయ బద్ధంగా ఉండే పాత్రలు గల సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రమే చేస్తానని చెప్పిందట.కానీ భర్తకి ఇచ్చిన మాట తప్పి అమలాపాల్ సమంత తప్పుకున్న ఓ సినిమాలో చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే..ధనుష్ హీరోగా చేసిన వడా చెన్నై సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా సమంతను తీసుకోవాలనుకున్నారట మూవీ మేకర్స్.కానీ సమంతకి స్టోరీ చెప్పగా ఈ పాత్రకి నాకంటే బాగా అమలాపాల్ సెట్ అవుతుంది అని చెప్పడంతో చిత్ర యూనిట్ ఆలోచించుకొని అమలాపాల్ దగ్గరికి వెళ్లి కథ చెప్పారట.
అయితే కథ బాగా నచ్చిన అమలాపాల్ రిజెక్ట్ చేయడానికి ఎలాంటి రీజన్ కనిపించలేదట.దాంతో భర్త వద్దని చెప్పినా కూడా వినకుండా ఆ సినిమాలో నటించిందట.ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయి చివరికి విడాకుల వరకు వెళ్లారు.అయితే అమలాపాల్ విడాకుల విషయం బయట వినిపించిన సమయంలో సమంత పేరు వినిపించింది. సమంత గనుక ధనుష్ మూవీ లో అమలాపాల్ ని తీసుకోండి అని సలహా ఇవ్వకపోయి ఉంటే అమలాపాల్ ఆ మూవీలో చేసేది కాదు.తన భర్తతో గొడవపడి విడాకులు తీసుకునేది కాదు అంటూ సమంత పేరు తెర మీదకి తీసుకొచ్చారు