ఆ రెండు కారణాల వల్లే గుంటూరు కారం కి అలాంటి రిజల్ట్ వచ్చింది.. నాగ వంశీ..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ , జయరామ్ ఈ సినిమాలో మహేష్ కు తల్లిదండ్రుల పాత్రలలో నటించగా ... రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశం వివరించాడు. తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... గుంటూరు కారం సినిమా భారీ మొత్తంలో నష్టాలను ఏమీ మిగిల్చలేదు. ఒక నైజాం ఏరియాలో తప్పిస్తే అన్ని ప్రాంతాలలో ఆ సినిమా బాగానే కలెక్షన్లను వసూలు చేసింది. ఇక సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. కానీ మేము గుంటూరు కారం అని మాస్ టైటిల్ పెట్టాం. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలకు అర్ధరాత్రి షో లను వేయకూడదు. మేము అలా వేసాము. ఈ రెండు కారణాల వల్లే ఈ సినిమా అనుకున్నంత స్థాయి విజయాన్ని సాధించలేదు అని మేము అనుకుంటున్నాము అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: