తరుణ్ చేయాల్సిన హిట్ సినిమా.. ఆ పాన్ ఇండియా హీరో దొబ్బేసాడా..? ఏంటి ఈ అరాచకం..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో హీరో తరుణ్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలుసు . ఒకప్పుడు లవర్ బాయ్ గా సినిమా ఇండస్ట్రీని మడత పెట్టేశాడు . అమ్మాయిల బుక్స్ లో ఎక్కడ చూసినా సరే తరుణ్ ఫొటోస్ ఉండేవి . మరి ముఖ్యంగా తరుణ్ కి కాలేజీ గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.. ఆ విషయం అందరికీ తెలిసిందే.  నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను ..సినిమాల మూమెంట్లో తరుణ్ ని అసలు బీట్ చేసే హీరోనే లేడు . ఎంతలా అంటే పెద్ద పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతున్న సరే తరుణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ పెద్ద హీరోలు నటించిన సినిమాను పోస్ట్ పోన్ చేసుకునేవాళ్ళు.  అంతలా తరుణ్ హవా కొనసాగింది .


అయితే ఏమైందో ఏమో కానీ సడన్గా ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయాడు . నవవసంతం సినిమా తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు . అరాకొరా ఆయనకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న సరే తరుణ్ పెద్దగా పట్టించుకోలేదు . అప్పట్లో నిహారికతో రెండో పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి . అప్పుడు మాత్రమే ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత తరుణ్ అసలు బయట ఎక్కడా కూడా కనిపించకపోవడం గమనార్హం. కాగా తరుణ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లోనే ఉన్నాడట . గతంలో ఓ సినిమా కూడా ఓకే అయిందట . కానీ తరుణ్ చేతికి వచ్చినట్లే వచ్చి ఆ సినిమా మరొక హీరో చేతికి వెళ్లిపోయిందట .


ఆ హీరో మరెవరో కాదు రామ్ చరణ్ . ఎస్ రామ్ చరణ్ నటించిన " గోవిందుడు అందరివాడేలే" సినిమాలో మొదటగా హీరోగా కృష్ణవంశీ తరుణ్ ని అనుకున్నాడట . తరుణ్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇస్తుంది అంటూ ఆశపడ్డారట . అయితే తరుణ్ ఆ సినిమాలో నటిస్తే జనాలు పెద్దగా లైక్ చేయలేకపోవచ్చు ..ఫెడవుట్ అయిపోయాడు కదా అంటూ కృష్ణవంశీకి కొందరు పెద్ద వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకే రామ్ చరణ్ తో ఈ సినిమాను తెరకెక్కించాడట . రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా తరుణ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది అంటూ కూడా తెలుసు అట . నిజానికి కృష్ణవంశీ తీసుకున్న డెసీషన్ నే రైట్.  ఈ సినిమా ఒకవేళ నిజంగా తరుణ్ చేసుంటే అంత పెద్ద హిట్ కాకపోయి ఉండొచ్చు . ఆఫ్ కోర్స్ గోవిందుడు అందరివాడేలే సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది . అలా తరుణ్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నట్లయింది. అయితే ఇది తెలియక చాలా మంది చరణ్ నే తరుణ్ సినిమాని దొబ్బేశాడు అంటూ మాట్లాడారు. అప్పుడు చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ అరాచకం ఏంట్రా సామీ..చరణ్ పైనే ఎందుకు మీకు పగ అంటూ బాగా ఇచ్చిపడేసారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: