సినీ ప్రేమికులకు పండుగే.. ఈ వారంలో థియేటర్, ఓటీటీ రిలీజ్ ల లిస్ట్ ఇదే!

Suma Kallamadi
దసరా పండుగ హడావుడి కాస్త ముగిసిపోయింది. దసరా పండగ సందర్భంగా థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త సినిమాలు ఏం లేవనే చెప్పాలి. అయితే కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న చిత్రాలు రిలీజ్ అవ్వబోతున్నట్టు సమాచారం. కానీ., ఈ సినిమాలపై పెద్దగా బజ్ లేదు. కానీ., ఓటీటీలో మాత్రం ఏకంగా 25 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవి? వాటి వివరాలు ఒకసారి చూద్దామా..
ఈ వారం థియేటర్ రిలీజ్ లు:
* లవ్ రెడ్డి: అక్టోబర్ 18న విడుదల
* ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల
* రివైండ్ : అక్టోబర్ 18న విడుదల
* వీక్షణం : అక్టోబర్ 18న విడుదల
* సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల
* ది డీల్ : అక్టోబర్ 18న విడుదల
* కల్లు కాంపౌండ్ : అక్టోబర్ 18న విడుదల
ఇక ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే..
ఇందులో ముందుగా నెట్‌ఫ్లిక్స్ విషయానికి వస్తే..
* మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14
* రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 15
* స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16
* గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17
* జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17
* ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18
* ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18
* ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18
అలాగే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ విషయానికి వస్తే..
* ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17
* స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
* కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
* లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా)- అక్టోబర్ 18
* కడైసి ఉలగ పొర్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 18
* ది డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
* ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
* ది పార్క్ మేనియాక్ (పోర్చుగీస్ చిత్రం)- అక్టోబర్ 18
ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ రిలీజ్ అయ్యే లిస్ట్ చూస్తే..
* రీతా సన్యల్ (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14
* 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
* రైవల్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
* రోడ్ డైరీ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18
ఇక చివరిగా జియో సినిమా ఓటీటీ విషయానికి వస్తే..
* క్రిస్పీ రిస్తే (హిందీ చిత్రం)- అక్టోబర్ 18
* హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 19
* హిస్టీరియా (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 19
* స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 16
* బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో ఓటీటీ- అక్టోబర్ 18
ఈ లిస్ట్ బట్టి చూస్తే వారం ఓటీటీ లో ఫుల్ జోష్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: