బాల‌య్య దెబ్బ‌కు అడ్ర‌స్ లేని చిరు, వెంకీ... ఇండ‌స్ట్రీ హిట్‌తో చుక్క‌లు చూపించాడు..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి మజాకాస్ తో తగ్గింది కానీ రెండు దశాబ్దాల క్రితం సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండేది. థియేటర్లో 50 రోజులు 100 రోజులు ఇలా హీరోల అభిమానుల మధ్య రిలీజ్ కి ముందు నుంచే పెద్ద చర్చలు నడిచేవి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో 2001 సంక్రాంతికి స్టార్ హీరోలు బాలకృష్ణ - చిరంజీవి - వెంకటేష్ నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ అద్భుతమైన పోటీలో బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు .2001 సంక్రాంతికి బాలకృష్ణ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహనాయుడు .. చిరంజీవి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మృగరాజు .. వెంకటేష్ కోడి రామకృష్ణ కాంబినేష‌న్లో దేవిపుత్రుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు. నరసింహనాయుడు - మృగరాజు రెండు జనవరి 11న రిలీజ్ అయ్యాయి. దేవి పుత్రుడు జనవరి 14న రిలీజ్ అయింది.

నరసింహనాయుడు - మృగరాజు రెండు సినిమాలలోను సిమ్రాన్ హీరోయిన్గా నటించారు. దేవిపుత్రుడు లో అంజిలా జవేరి - సౌందర్య హీరోయిన్గా నటించారు. రిలీజ్ కి ముందు బాలయ్య సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దేవి పుత్రుడు - మృగరాజు సినిమాలు భారీ అంచ‌నాల‌ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. హైదరాబాద్లో అయితే నరసింహనాయుడు సినిమాకు రిలీజ్కు ముందు కేవలం 5 థియేటర్లు మాత్రమే ద‌క్కాయి. మిగిలిన అన్ని స్క్రీన్లు మృగరాజు - దేవి పుత్రుడు సినిమాలే ఆక్రమించాయి. తొలిరోజు తొలి ఆటకే మృగరాజు సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. నరసింహనాయుడు యావరేజ్ అవుతుందని అనుకున్నారు. దేవి పుత్రుడు సినిమా కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కడ నుంచి నరసింహనాయుడు సినిమాకు టాక్‌ రోజురోజుకు పెరిగిపోయింది. పది రోజులు అయ్యేసరికి టికెట్లు దొరకలేదు. అసలు ఏ థియేటర్లో చూసినా నెల రోజులు హౌస్బుల్స్ పడ్డాయి.

నెలరోజుల వరకు నరసింహనాయుడు సినిమా టికెట్ దొరకటం అంటే గగనం అయ్యేది. అలా దక్షిణ భారతదేశ సినీ చరిత్రలోనే 105 కేంద్రాలలో వంద రోజులు ఆడిన తొలి సినిమాగా నరసింహా నాయుడు రికార్డులకు ఎక్కింది. 19 కేంద్రాలలో ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకుంది. మృగరాజు సినిమా పట్టుమని 20 రోజులు కూడా చాలా చోట్ల ఆడలేదు. దేవి పుత్రుడు మాత్రం అతి కష్టం మీద 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవిపుత్రుడు సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి. మృగరాజు సినిమా తీసిన సీనియర్ నిర్మాత దేవి వరప్రసాద్ ఆ సినిమాతో ఆర్థికంగా కుదైలైపోయారు. నరసింహనాయుడు సినిమా మాత్రం పెట్టిన పెట్టుబడికి 4 - 5 రెట్లు లాభాలు తెచ్చిపెట్టి ఇండస్ట్రీ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: