చిన్న విషయానికే ఆందోళన.. వీటిని వదిలేస్తేనే రిలీఫ్..!
కానీ అతిగా తాగితే మాత్రం ఆందోళనకు దారితీస్తుంది. అందులోని కెఫీన్ మీలో అప్పటికే ఉన్న యాంగ్జైటి ని మరింత ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆందోళన, భయం వంటివి పెరుగుతాయి. కెఫిన్ వాడకాన్ని తగ్గించాలనుకుంటున్నారు నిపుణులు. ఆయా పనుల నిర్వహణలో చూద్దాంలే... చూద్దాంలే అనే ధోరణి పలు ఊరిలో ఆందోళనకు కారణం అవుతుంది. ముఖ్యంగా అవసరమైన సమయానికి చెయ్యకుండా వాయిదా వేయటం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమైన పనులను వాయిదా వేసే కంటే... కాస్త ఇబ్బంది అనిపించిన సమయానికి పూర్తి చేసుకోవడం మీలోని యాంగ్జైటీని తగ్గిస్తుంది. ప్రస్తుతం యువతలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు నిద్రలేమి ఒకటి.
రాత్రులు ఎక్కువసేపు స్కిన్లకు అతుక్కుపోవటం, ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి నివేదికల్లో నిమగ్నమై పోవటం వంటి కారణాలతో చాలామంది సమయానికి నిద్రపోరు. క్రమంగా ఇది నిద్రలేమికి దారితీస్తుంది. సమయానికి నిద్ర లేకపోవటం కూడా శరీరంలో జీర్ణ క్రియలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను పెంచుతుంది. మీరు యంగ్జైటిస్ నుంచి బయటపడాలంటే సమయానికి నిద్రపోవడం మంచిది. సోషల్ మీడియాను మన అవగాహన కోసం, అవసరం కోసం ఉపయోగించుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అదే పనిగా రాత్రింబగలు ఎక్కువ సమయం అందులోనే నిమగ్నం అయిపోతే మాత్రం స్ట్రెస్, యాంగ్జైటిస్ పెరుగుతుయి.