క్యాన్సర్ ను జయించిన స్టార్ హీరో...ఆ పుకార్లకు చెక్ పెడుతూ వీడియో
ఆ వీడియోలో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. తనకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయని.. అది నిజం కాదని అన్నారు. యూరినరీ బ్లాడర్‌కి సంబంధించిన చిన్న సర్జరీ జరిగిందని చెప్పారు. ఈ విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వొద్దు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మార్చి నుంచి షూటింగులకి హాజరు కావచ్చని డాక్టర్లు చెప్పారని అన్నారు. త్వరలో జోష్‌తో తాను మళ్ళీ సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. అప్పుడు మళ్లీ ఆయన డ్యాన్సులు, ఫైట్లు చూసి అందరూ ఆశ్చర్యపోతారని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లని శివన్న ఖండిస్తూ.. ఈ విషయంపై వార్తల్లో వస్తున్న రూమర్స్ ని నమ్మకండి అని చెప్పుకొచ్చారు. అనంతరం శివన్న సతీమణి కూడా మాట్లాడారు. అభిమానుల అందరి ప్రార్థనల వల్ల రిపోర్టులు అన్ని నెగిటివ్ వచ్చాయని.. అలాగే పాథాలజీ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు శివన్న క్యాన్సర్ ఫ్రీ అంటూ ఆమె శివన్నతో కలిసి ఈ వీడియో సందేశాన్ని అభిమానులకి పంపించారు.