ఏపీ: ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ తెరపైకి డిమాండ్..?
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని, మన రాష్ట్రం పేరును తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలని, కేరళ వాళ్ళు ఒక సున్నా లేకపోతే ఇబ్బందయ్యింది.. మా రాష్ట్రం మా భాష మార్చాల్సిందే అనుకున్నారు. అందుకే కేరళంగా మార్చుకున్నారు. అటువంటి పట్టుదలే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వస్తే పేరే కాదు మన బతుకులు కూడా మారుతాయి అంటూ గరికపాటి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల అమలాపురంలో నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు భాష మహాసభలలో ఈ విషయాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చింది మొదలు చనిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా ఆందోళననే చెందుతున్నారని, పిల్లలకు ఐదవ తరగతి వరకు అయినా కనీసం తెలుగు మాధ్యమం కచ్చితంగా చేసినప్పుడే తెలుగు భాష బ్రతుకుతుందని, తన ఇద్దరు పిల్లల్ని కూడా తాను తెలుగు మీడియంలోనే చదివించాను అంటూ తెలియజేశారు. తెలుగు మాధ్యమం వల్ల ఎవరూ నష్టపోరని వెల్లడించారు గరికపాటి. ప్రతి ఒక్కరు సొంత దేశంలోని ఇక్కడే పనిచేయాలనుకుంటే ఇండియా ఐదేళ్లలో విశ్వగురువుగా మారుతుందని తెలిపారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చడానికి ప్రయత్నించిన కొంతమంది ఏకీభవించారు మరి కొంతమంది ఆంధ్ర అనే చారిత్రక పేరును మార్చడం వల్ల అభ్యంతరాలు వచ్చాయని , దీంతో రాష్ట్రం పేరు మార్చలేకపోయారని.. అందుకే తెలుగు గంగ, తెలుగు గ్రామీణ పథకం వంటి పేర్లతో తెలుగు పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారని తెలిపారు.