సీడెడ్ లో గేమ్ ఛేంజర్ కు దిమ్మతిరిగే షాక్.. పుష్ప2 తో పోలిస్తే అంత తక్కువా?
పుష్ప ది రూల్ సీడెడ్ హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడవగా గేమ్ ఛేంజర్ మూవీ సీడెడ్ హక్కులు మాత్రం కేవలం 22 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది. సీడెడ్ లో గేమ్ ఛేంజర్ కు దిమ్మతిరిగే షాక్ తగిలిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 సినిమాతో పోల్చి చూస్తే హక్కులు ఇంత తక్కువా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ మూవీ నైజాం రైట్స్ మాత్రం ఒకింత భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల్లో బిజినెస్ పరంగా గేమ్ ఛేంజర్ టాప్ లో ఉండగా డాకు మహారాజ్ ఆ తర్వాత స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం చివరి స్థానంలో ఉంది. సంక్రాంతి సినిమాలు హిట్టైతే మాత్రం నిర్మాత దిల్ రాజు జాక్ పాట్ కొట్టినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
డాకు మహారాజ్ నైజాం హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో అనే చర్చ జోరుగా జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు గతంలో ఎప్పుడూ చేయని స్థాయిలో రిస్క్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయ్. సంక్రాంతి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. తమిళంలో గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేస్తున్నారని భోగట్టా. ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను అంతకంతకూ పెంచాలని సినీ అభిమానులు భావిస్తున్నారు.