టాలీవుడ్ ఇండస్ట్రీలో హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి బాలయ్య ఏది చేసినా... హాట్ టాపిక్ అవుతుంది. అలా ఇప్పటికే చాలా సినిమాలు చేసిన నందమూరి బాలయ్య... ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి పండుగ కంటే ముందు... తెలుగు ప్రేక్షకులకు పండుగ వాతావరణన్ని తీసుకువస్తున్నాడు నందమూరి బాలయ్య.
డాకు మహారాజు సినిమా షూటింగ్ అలాగే... అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఈ సినిమా నుంచి.. వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు. " దబిడి దిబిడి" అంటూ సాగే ఓ పాటను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఎస్ ఎస్ తమన్ ఈ పాటకు సంగీత స్వరాలు అందించాడు.
అటు ఈ సినిమాలో... నందమూరి బాలయ్య అదిరిపోయేటప్పుడు దుమ్ము లేపాడు. నందమూరి బాలయ్య సరసన... బాలీవుడ్ ఐటం బాంబు ఊర్వశి రౌతేలా నటించింది. బాలయ్యతో కలిసి ఈ పాటలో చిందులు వేసింది. ఇక దబిడి దిబిడి అంటూ సాగిన ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో... తెగ వైరల్ అవుతుంది. అందరూ ఈ పాటను... చాలా బాగా ఆస్వాదిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... నందమూరి బాలయ్య ను టార్గెట్ చేసింది వైసిపి సోషల్ మీడియా.
నందమూరి బాలయ్య చేసిన దబిడి దిబిడి ఐటమ్ సాంగ్ లో... అసభ్యకరమైన స్టెప్పులు ఉన్నాయని వైసీపీ సోషల్ మీడియా మండిపడుతోంది. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా వెనుక బాలయ్య చేసిన పనులు... చాలా చండాలం గా ఉన్నాయని... వీడియోలు వైరల్ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి... ఇలాంటి డ్యాన్సులు చేస్తారా...? అంటూ మండి పడుతోంది.