దేవ‌ర క్లైమాక్స్‌కు డ‌బుల్ రేంజ్‌లో ' వార్ 2 ' క్లైమాక్స్‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ కుర్ర క్రేజీ హీరో... యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సక్సెస్ మామూలుగా ఎంజాయ్ చేయ‌డం లేదు. ఎన్టీఆర్ కు త్రిబుల్ ఆర్ తో తిరుగులేని పాన్ ఇండియా హిట్ ద‌క్కింది. అయితే ఆ సినిమా లో ఎన్టీఆర్ ఒక్క‌డు మాత్ర‌మే హీరో కాదు.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా హీరో .. పైగా టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్. ఎస్ . రాజమౌళి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. దీంతో త్రిబుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ రాజ‌మౌళి కి.. అటు రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఇటు ఎన్టీఆర్ ముగ్గురికి ద‌క్కింది.

అయితే దేవ‌ర సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో అద‌ర గొట్టేసింది. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు అయినా కూడా ఆ రేంజ్ లో క్రేజ్ అయితే  శివ కు రాలేదు. కొర‌టాల శివ ఓ వీక్ స‌బ్జెక్ట్ ను ప‌ట్టుకుని.. దేవ‌ర సినిమా తీశారు. పైగా క్లైమాక్స్ పై చాలా కంప్లైంట్లు వ‌చ్చాయి. ఇక ఈ క్లైమాక్స్ సంగ‌తి ఇలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ న‌టిస్తోన్న వార్ 2 సినిమా క్లైమాక్స్ గురించి చ‌ర్చ న‌డుస్తోంది.

ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ను కలిసి బిగ్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చూస్తున్నారు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో వార్-2 మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నార‌ట‌. ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ ?  దేవ‌ర క్లైమాక్స్ లో అనుకున్నంత యాక్ష‌న్ లేదు.. వార్ 2 సినిమాలో యాక్ష‌న్ అదిరిపోతుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: