ఆ తప్పుడు పని ఎందుకు చేసానా అని బాధపడుతున్న రష్మిక..లైఫ్ లో మర్చిపోలేనిది..!?

Thota Jaya Madhuri
లైఫ్ లో కొన్నిసార్లు కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం.  కొన్నిసార్లు తెలియకుండా మరికొన్నిసార్లు తెలిసి . తెలిసి తెలియకుండా చేసిన తప్పుని మనం ఏమీ చేయలేం ..ఆ తప్పు మరొకసారి జరగకుండా చూసుకోవడమే . అయితే తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాం అని కూడా మనకు తెలిసిన అదే తప్పులు చేయడం నిజంగా వరస్ట్ ధింగ్ అనే చెప్పాలి . అలాంటి ఒక తప్పుడు పనిచేసి రష్మిక ఇప్పటికీ బాధపడిపోతుందట . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది .
అంతేకాదు పుష్ప 2 సినిమాతో వేరే లెవెల్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది . అయితే రష్మిక మందన్నా గతంలో ఒక 100 కోట్ల సినిమా ఆఫర్ ని వదిలేసుకుంది.  ఆ సినిమా హిట్ అవుతుంది అని తెలిసిన కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా వదిలేసుకోవడం ఆమెకు ఇప్పటికీ బాధ కలిగిస్తుందట . ఆ సినిమా మరేదో కాదు "ధమాక". త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటించిన 'ధమాకా' సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే .
ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది . నిజానికి రవితేజ లాంటి మాస్ హీరోతో నటించే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం అందరి హీరోయిన్స్ లో ఉంటుంది. అందుకే అలాంటి ఆఫర్ ని మిస్ చేసుకోరు.  రష్మికకు మంచి ఆఫర్ వచ్చినా ఆ టైంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో అమ్మడు ఈ ఆఫర్ ని మిస్ చేసుకుందట.  ఇప్పటికీ ఆ ఆఫర్ ని మిస్ చేసుకున్నందుకు బాధపడుతూనే ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: