వావ్:బాలయ్య ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్.. దసరాకు డబుల్ ధమాకా..!
వాస్తవానికి ఈ సినిమా కూడా దసరాకి రిలీజ్ కావాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కానీ అప్డేట్ల విషయంలో మాత్రం అభిమానులను ఊరిస్తూ ఉన్న టైటిల్ విషయంలో మాత్రం అభిమానులు కాస్త నిరాశతోనే ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదని కనీసం టైటిల్ కూడా అనౌన్స్మెంట్ చేయలేదని వార్తలు వినిపిస్తున్న తరుణంలో దసరా కానుకగా టైటిల్ని కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా బాలయ్య అభిమానులకు ఈసారి దసరాకి డబుల్ ధమాకా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే 109 వ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న ఇక అఫీషియల్ గా ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. దీంతో టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ పైన కూడా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఈ రెండు ఒకేసారి అనౌన్స్ చేస్తే మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కు ఆనందం కలుగుతుందని తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా లైన్లో పెడుతూ ఉండడమే కాకుండా తన కొడుకు సినీ ఇండస్ట్రీపై ఎంట్రీ చేస్తున్నాడు కనుక అతని మీద కూడా కాస్త ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.