తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలకు కథ రచయితగా పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈయన మిర్చి మూవీ తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ కి దర్శకత్వం వహించి మరో విజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత ఈ దర్శకుడు మరోసారి మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను సినిమాకు దర్శకత్వం వహించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో కెరియర్ను కొనసాగించిన ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒకే కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది.
\ఇకపోతే దేవర పార్ట్ 2 మూవీ స్టార్ట్ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దానితో ఈయన ఆ గ్యాప్ లో మరో మూవీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు కొరటాల స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేశాడు. ఇప్పుడు దేవర పార్ట్ 2 మూవీ స్టార్ట్ అయ్యే లోపు సినిమా చేయాలి అంటే స్టార్ హీరోలు దాదాపుగా ఎవరు కాళీ లేరు. దానితో ఈయన కెరియర్ లో ఫస్ట్ మొట్ట మొదటి సారి స్టార్ హీరో కాకుండా మామూలు హీరోతో సినిమా చేస్తాడా ..? లేక దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యే వరకు ఖాళీగా ఉంటాడా అనేది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. మరి కొరటాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.