ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియన్ సినిమాలకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నాయి. ఇకపోతే సౌత్ ఇండియన్ మూవీలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుండి విడుదల అయిన సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1290 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాలలో అత్యంత గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన సినిమాలు లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది. ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో యాష్ హీరోగా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 906.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసులు చేసి 4 వ స్థానంలో నిలిచింది. రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O సినిమా ప్రపంచ వ్యాప్తంగా 709 కోట్ల కలెక్షన్ లను వాసులు చేసే 5 వ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 630.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వాసులు చేసి 6 వ స్థానంలో నిలిచింది. జైలర్ మూవీ 606.30 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలోనూ , బాహుబలి సినిమా 605 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలోనూ , లియో మూవీ 600.60 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ 487.54 కలెక్షన్లతో 10 వ స్థానంలోనూ నిలిచాయి.