అందరూ నమ్మిన కథను తారక్ ఎందుకు నమ్మలేకపోయాడు.. అక్కడే మిస్టేక్ చేశాడా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అనే మూవీ లో హీరోగా నటించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కొంతకాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు అని , బుచ్చిబాబు చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చింది అని , వారి కాంబినేషన్లో మూవీ త్వరలో స్టార్ట్ కాబోతుంది అని అనేక వార్తలు వచ్చాయి.

కానీ చివరకు ఆ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. బుచ్చిబాబు , రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బుచ్చిబాబు , చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు అనేకం బయటకు వచ్చాయి. బుచ్చిబాబు , చరణ్ తో చేయబోయే సినిమా కథపై అనేక మంది ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. శివరాజ్ కుమార్ ... చరణ్ , బుచ్చిబాబు కాంబో మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈయన బుచ్చిబాబు అద్భుతమైన కథను తయారు చేశాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించనున్న రెహమాన్ కూడా ఇది ఒక అద్భుతమైన కథ అని చెప్పాడు. ఇక విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. అది ఒక అద్భుతమైన కథ అని చెప్పాడు. ఇలా ఇంతమంది సూపర్ అన్న కథను ఎన్టీఆర్ రిజెక్ట్ చేసి ఉండడు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసింది వేరే కథ అయ్యుంటుంది. బుచ్చిబాబు , చరణ్ తో చేయబోయేది వేరే కథ అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: