పోయిన సంవత్సరం సంక్రాంతి పండక్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ వార్ గట్టిగానే జరిగింది. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సైన్ధవ్ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమాలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే మొదటగా పోయిన సంవత్సరం జనవరి 12 వ తేదీన మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం విడుదల కాగా , అదే తేదీన తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయింది.
ఇక జనవరి 13 వ తేదీన వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైన్ధవ్ మూవీ విడుదల కాగా , జనవరి 14 వ తేదీన నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో గుంటూరు కారం సినిమాకు యావరేజ్ టాక్ రాగా , హనుమాన్ సినిమాకు మాత్రం బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదల అయిన సైన్ధవ్ మూవీ కి ఫ్లాప్ తక్ రాగా నా సామి రంగ సినిమాకు హిట్ టాక్ వచ్చింది.
దానితో టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి గుంటూరు కారం సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేసి యావరేజ్ విజయాన్ని అందుకోగా , హనుమాన్ సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సైంధవ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ చూపలేక ఫ్లాప్ మూవీ గా నిలవగా , నా సామి రంగ మంచి కలెక్షన్లను వాసులు చేసి హిట్ సినిమాగా నిలిచింది. ఇలా ముగ్గురు స్టార్ హీరోలతో పోటీ పడి తేజ సజ్జ 2024 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలచాడు.