మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ను నిన్న సాయంత్రం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ రికార్డులను నెలకొల్పుతుంది అని మెగా ఫాన్స్ మొదటి నుండి ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపోతే విడుదల అయిన తర్వాత 100 కే లైక్స్ ను అత్యంత వేగంగా అందుకున్న సినిమా ట్రైలర్ల విషయంలో గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ చాలా వెనుకబడిపోయింది. సలార్ సినిమా ట్రైలర్ కి 3 నిమిషాల్లో 100 కే లైక్స్ దక్కితే , భీమ్లా నాయక్ ట్రైలర్ కు నాలుగు నిమిషాల్లో 100 కే లైక్స్ దక్కాయి.
వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ కు 7 నిమిషాల్లో 100 కే లైక్స్ దక్కితే , కల్కి 2898 AD మూవీ ట్రైలర్ కి 7 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ కి 8 ప్లేస్ మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కితే , పుష్ప పార్ట్ 2 మూవీ ట్రైలర్ కి 8 ప్లేస్ మినిట్స్ లోనే 100 కే లైక్స్ దక్కాయి. ఇక సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు 9 మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కితే , ఆది పురుష్ సినిమా ట్రైలర్ కు 9 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కాయి. దేవర మూవీ ట్రైలర్ కు 9 ప్లస్ మినిట్స్ లోనే 100 కే లైక్స్ దక్కితే , గుంటూరు కారం సినిమా ట్రైలర్ కు 15 మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కాయి. ఇక పుష్ప మూవీ ట్రైలర్ కు 19 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కితే , బ్రో సినిమా ట్రైలర్ కి 21 మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కాయి.
ఇకపోతే నిన్న సాయంత్రం విడుదల అయిన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ కు 25 మినిట్స్ లో 100 కే లైక్స్ దక్కాయి. ఇలా అత్యంత వేగంగా 100 కే లైక్స్ ను సాధించిన తెలుగు సినిమా ట్రైలర్ల విషయంలో గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చాలా వెనకబడిపోయి ఉంది. మరి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను , లైక్స్ ను అందుకున్న సినిమా ట్రైలర్ల విషయంలో గేమ్ చేంజర్ సినిమా ఏ స్థానంలో నిలుస్తుందో అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.