సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల వద్ద అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. చాలా వరకు సంక్రాంతి పండక్కు టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో అవి చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తూ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి వాతావరణం సంక్రాంతి సమయంలో నెలకొంటూ ఉంటుంది.
ఇకపోతే 2023 వ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి సంస్థ వారే నిర్మించడం విశేషం. ఇకపోతే వీర సింహా రెడ్డి మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... వాల్టేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ రెండు మూవీ.లు కూడా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. కానీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కంటే కూడా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసి 2023 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ఇకపోతే వీర సింహా రెడ్డి మూవీలో శృతిహాసన్ , హాని రోజు హీరోయిన్లుగా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. వాల్టేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో రవితేజ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.