ఐశ్వర్య రాయ్ విడాకులు ? నిజమే.. పర్సనల్‌గా రాసుకున్న డైరీ పేజీ లీక్..!
వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కూతురు కూడా ఉంది . ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్ కాపురంలో కలహాలు ఉన్నాయ నే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐశ్వర్య - అభిషేక్ బచ్చన్ తో కలిసి ఉండటం లేదని .. ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని విడాకులు తీసుకోబోతున్నార నే పుకార్లు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజా గా ఆమె రాసుకున్న పర్సనల్ డైరీలో పేజీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందులో తన భర్తతో ఎలా ఉండాలని విషయాలను ఐశ్వర్య రాసుకుంది. 'చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకెళ్లే పార్ట్‌నర్ కావాలి', 'నిజాయతీ, మర్యాద వంటి సద్గుణాలు కలిగిన వ్యక్తి కావాలి' అని డైరీలో ఐశ్వర్య రాసింది.
ఇక తన కలల రాకుమారుడికి కావాల్సిన లక్షణాలు అభిషేక్ బచ్చన్‌లో లేనట్టు ఉన్నాయి. అందుకే విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'మై లవ్. ఆల్వేస్ ఐశ్వర్య రాయ్' అని సంతకం చేసిన ఆ పేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఐశ్వర్య ఆ డైరీ ఏ రోజు, ఏ సంవత్సరం రాశారనేది తెలియడం లేదు. ఈ డైరీ పేజీ లీకవడంతో ఐశ్వర్యకు కావాల్సిన లక్షణాలు అభిషేక్‌లో లేవని.. త్వరలో విడాకులు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. మరి ఏ జరుగుతుందనేది కాలమే నిర్ణయించాలి.