బాలీవుడ్ భామలతో బాలయ్య.. ఈ రికార్డు ఆయనకే సొంతం..!

Amruth kumar
నట‌సింహం నందమూరి బాలకృష్ణ తన 50 సంవత్సరాలు సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు నటించారు. ఎందరో హీరోయిన్లతో ఆడి పాడారు. అలాంటి బాలయ్య సినీ కెరీర్ లో బాలీవుడ్ హీరోయిన్లతో కూడా పలు సినిమాలు చేశాడు. అయితే బాలయ్య ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్లతో చేసిన సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ముందుగా బాలకృష్ణ  సొంతంగా నిర్మించిన తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణకు జంటగా బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌ నటించింది. అలాగే బాలయ్య హీరోగా వచ్చిన అల్లరి పిడుగు సినిమాలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది.
అలాగే బాల‌య్య‌ హిట్ సినిమాల్లో బంగారు బుల్లోడు కూడా ఒకటి ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్  బాలయ్యకు జంట‌గా నటించింది. అలాగే బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా లెజెండ్ ఇందులో బాలయ్యకు జంట‌గా రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు. రాధిక‌ ఆప్టే కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాగే సోనాల్ చౌహాన్ కూడా బాలీవుడ్ లో నటిస్తుంది. ఆ తర్వాత సోనాల్ చౌహాన్ మరోసారి బాలయ్య తో డిటెక్టర్, రూలర్ సినిమాల్లో కనిపించింది.
బాలకృష్ణ హీరోగా వచ్చిన చెన్నకేశవరెడ్డి, పాండురంగడు సినిమాలో టబు నటించింది. ఈమె కూడా  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాగే బాలయ్య హీరోగా వచ్చిన వీరభద్ర సినిమాలు మరో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా నటించింది. అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాలో బాలయ్యకు జంటగా మరో బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్, నేహా ధూపియా నటించారు. అలాగే బాలకృష్ణ నటించిన సుల్తాన్ మూవీలో నటించిన దీప్తి పట్నాకర్ కూడా బాలీవుడ్ లో నటించింది. బాలయ్య హీరోగా వచ్చిన ఒక్క మగాడు సినిమాలో అయ‌న‌కు జంట‌గా నటించిన నిషా కొటారి కూడా బాలీవుడ్లో మెప్పించింది. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాలయ్య హీరోగా వచ్చిన ధర్మక్షేత్రం మూవీలో బాలయ్యకు జంటగా నటించిన దివ్యభారతి కూడా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
అలాగే బాలయ్య నటించిన అశ్వమేధం సినిమాలో నటించిన నగ్మా కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలయ్య సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన నరసింహనాయుడు మూవీలో బాల‌య్య‌కు జంటగా నటించిన  ప్రీతి జింగానియా కూడా బాలీవుడ్ లో మెరిసిన ముద్దుగుమ్మ. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటిచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన దీపిక, మధుమతి కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారే. అలాగే బాలయ్య కెరీర్ మొదట్లో నటించిన భార్గవ రాముడు సినిమాలో కూడా బాల‌య్య‌కు జంట‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మందాకిని నటించింది. ఇలా బాలయ్య తన కెరీర్లో ఇప్పటివరకు ఎందరో బాలీవుడ్ హీరోయిన్లతో నటించి ఆడిపాడాడు. ఇలా బాలకృష్ణ సీనియర్ హీరోలలో ఎవరూ చేయని విధంగా అత్యధిక బాలీవుడ్ హీరోయిన్‌ల‌తో నటించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: