ఈ మధ్యకాలంలో చాలామంది సీనియర్ నటీనటులు చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులపై నోరు విప్పుతున్నారు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై జస్టిస్ హేమా కమిటీ షాకింగ్ విషయాలను బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఎప్పుడైతే రిపోర్టు బయట పెట్టిందో అప్పటినుంచి అన్ని ఇండస్ట్రీలలో డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతల వల్ల ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు. వారు ఆ విధంగా చెప్పడంతో అది కాస్త వైరల్ గా మారుతుంది. కేరళ సర్కార్ ఏర్పాటు చేసినట్టుగానే అన్ని ఇండస్ట్రీలలో ఇలాగే కమిటీలు వేయాలని, ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు నటీమణులు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఆ దిశగా అడుగులు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సమంత 2019లో నియమించినటువంటి కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరింది.
ఇదే తరుణంలో తాజాగా వ్యాంప్ క్యారెక్టర్స్ లో ఎంతో ఫేమస్ అయినటువంటి నటీమణి జ్యోతి మీడియా ముందుకు వచ్చి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. తను కెరియర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. ఓ స్టార్ డైరెక్టర్ షూటింగ్ టైంలో తనని ఇబ్బంది పెట్టారని, షూటింగ్ జరుగుతున్న సమయంలో అందరూ జనం ఉండగానే డైరెక్టర్ పిలిచి నా చీర విప్పి బెడ్ మీద పడుకోమని అన్నాడు. ఆయన చెప్పిన మాటలకు నేను షాక్ అయిపోయాను. ఆ టైంలో సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్,లైట్ బాయ్స్ ఇలా అందరూ ఉన్నారు.
కానీ డైరెక్టర్ ఏ సీన్ ఉంటుందని ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడే చెప్పి చీర విప్పాలని అనడంతో నేను చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. ఈ సీన్ మార్చాలని డైరెక్టర్ కు రిక్వెస్ట్ చేశాను. దీంతో ఆయన కోపానికి వచ్చి నాకే ఎదురు చెప్తావా అంటూ నాపై ఫైర్ అయ్యాడు. కానీ నా మనసుకు నచ్చని క్యారెక్టర్ నేను చేయనని మేకప్ తీసి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పటినుంచి ఆ డైరెక్టర్ తో నేను మళ్ళీ సినిమాలు చేయలేదని జ్యోతి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడంతో అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఈమె ఏ డైరెక్టర్ గురించి అలా మాట్లాడిందో ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు.