మీడియం రేంజ్ హీరోలకి అసలు పరీక్ష మొదలైందా.. వారందరిపై పెద్ద భారం..?

MADDIBOINA AJAY KUMAR
కొంత కాలం క్రితం తెలుగు ప్రేక్షకులు ఓటిటి లో కంటెంట్ ను చూడడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఇండియాలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులు కూడా ఓటిటి లో కంటెంట్ చూడడానికి బాగా అలవాటు పడిపోయారు. ఈ ఓటిటి కంటెంట్ ద్వారా భారీ ఎత్తున మీడియం రేంజ్ హీరోలపై ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో వారి సినిమాలు ధియేటర్లలో విడుదల అయిన వందల కోట్ల కలెక్షన్లను ఈజీగా రాబడుతున్నాయి. సినిమా బాగుంటే వేల కోట్ల కలెక్షన్లను కూడా రాబడుతున్నాయి. ఇక చిన్న సినిమాల విషయానికి వస్తే ఆ మూవీ లను చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిస్తూ ఉంటారు. అలాంటి సినిమాలకు థియేటర్లలో కొద్ది మొత్తంలో కలెక్షన్లు వచ్చినా సరిపోతుంది.

ఆ తర్వాత సాటిలైట్ , డిజిటల్ హక్కుల ద్వారా కూడా ఆ సినిమాలకు మంచి డబ్బులు రావడంతో చిన్న సినిమాలను తెరకెక్కించిన వారికి కూడా ఈ మూవీల ద్వారా ఎంతోకొంత లాభం చేకూరుతుంది. ఎటు చూసినా కూడా మీడియం రేంజ్ హీరోల పరిస్థితి కఠినంగా మారింది. ఎందుకు అంటే వీరి సినిమాలకు బడ్జెట్ పర్వాలేదు అనే స్థాయిలో అవుతుంది. ఆ రేంజ్ బడ్జెట్ ఓన్లీ సాటిలైట్ , డిజిటల్ హక్కుల ద్వారా రాబట్టడం కష్టం. థియేటర్లలో ఈ సినిమాలో పెద్ద మొత్తంలోనే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. వీరి సినిమాలను చూడడానికి జనాలు కూడా అత్యంత భారీ ఎత్తున ఆసక్తి చూపించకపోవడం వల్ల వీరి సినిమాలకు థియేటర్లో పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం లేదు. ఒక నాని మాత్రమే పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతూ వరుస విజాలను అందుకుంటున్నాడు. మిగతా మీడియం రేంజ్ హీరోలలో చాలా మంది ఈ మధ్య కాలంలో విజయాలను అందుకోవడం లేదు. ఓటీటీ ల ప్రభావం కూడా ఈ హీరోలపై పెద్ద ఎఫెక్ట్ ను చూపిస్తుంది.  వీరు మంచి కంటెంట్ తో ముందుకు వస్తేనే థియేటర్లలో భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉంటాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: