యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఇకపోతే ఈ ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా ఓ మూవీ మేకర్స్ పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ సినిమాను ఇప్పటికే చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుండి మాత్రం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ లోని ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసలు వచ్చినట్లు , అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు , అలాగే ఈ సినిమాలోని ఫైట్స్ ఈ మూవీ కే ప్లేస్ గా నిలవనున్నట్లు మరియు కొరటాల ఈ సినిమాలోని వి ఎఫ్ ఎక్స్ పనులను అద్భుతంగా తీర్చేదినట్లు ఓవరాల్ గా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు సెన్సార్ బోర్డు సభ్యులు రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది.