ఒక రోజు ముందుగానే 'దేవర' రిలీజ్.. ఎక్కడంటే..?
ఇక అభిమానుల్లో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అన్న క్యూరియాసిటీని రేకెత్తించింది. అప్డేట్ కు అప్డేట్ కు మధ్య ఎక్కువ గ్యాప్ ఇస్తే.. ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎక్కడ డివియేట్ అవుతారో అని ముందుగానే తన విజన్ తో పసిగట్టిన కొరటాల అందుకు తగ్గట్లుగానే మాసీవ్ అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులకు కిక్కిస్తున్నాడు. పైగా దేవరలో ఇంకా ఇవ్వాల్సిన అప్డేట్స్ చాలా ఉన్నాయి. వాటి విషయంలో కొరటాల ఎలా ప్లాన్ చేశాడో అని ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. దాంతో ప్రమోషనల్ కంటెంట్, అప్డేట్స్ విషయంలో కొరటాల శివ ప్లానింగ్, విజన్ కు 'దేవర' ఓ సాక్ష్యంగా నిలుస్తోందని సినీ విశ్లేషకులతో పాటుగా మూవీ లవర్స్ చెప్పుకొస్తున్నారు.దేవర సినిమాకు జాన్వీ కపూర్ గ్లామర్ హైలెట్ గా నిలవనుందని భోగట్టా.దేవర1, దేవర2 పాన్ ఇండియా హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకింత ఎక్కువ నిడివితోనే థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. దేవర టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా 26వ తేదీన యూఎస్ఏ లో ప్రీమియర్లు వేయనున్నారు.ఈ విషయాన్ని మూవీ టీం తాజాగా ప్రకటించింది. ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీ ని యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నాయి.దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ తన అందంతోఆకట్టుకోబోతుంది.ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.