రామ్ : అలాంటి పకోడీ గాళ్ళ గురించి పట్టించుకోవద్దు..!!

frame రామ్ : అలాంటి పకోడీ గాళ్ళ గురించి పట్టించుకోవద్దు..!!

murali krishna
రామ్ పోతినేని అనే కంటే ఇస్మార్ట్ రామ్ లేదా ఇస్మార్ట్ శంకర్ అంటే అందరూ టక్కున గుర్తు పట్టేస్తారు. అంతేకాదు ఎనర్జీకి మారుపేరు రామ్ అని చెప్పడంలో ఎలాంటి శక్తి అతిశయోక్తి అవసరం లేదు.ఎందుకంటే తెలుగు వెండి తెరపై అతని చురుకుదనం చూస్తే ఎవ్వరికైనా ఇట్టే హుషారు వచ్చేస్తుంది. అంతేకాదు ఉత్సాహం అతని నటనను చూస్తే ఉప్పొంగిపోతుంది. మైనర్ గా ఉన్నప్పుడే హీరోగా నటించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.దేవదాసుతో తెలుగు వెండి తెరపై ప్రస్థానాన్ని ప్రారంభించిన రామ్ తన తొలి సినిమాలోనే నటనతో పాటు డ్యాన్సులతోనూ అదరగొట్టేశాడు. ఆ తర్వాత జగడం సినిమాలో నటింటి మాస్ లుక్ కూడా సంపాదించుకున్నాడు. అయితే అది ఫెయిల్ అయినా మరో మంచి సినిమాతో వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.అయితే ఒకప్పుడు కథల ఎంపిక విషయంలో కొంత గందరగోళంలో ఉన్న రామ్, ప్రస్తుతం తన తీరును పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం కొత్త తరహా కథలకు పెద్ద పీట వేస్తున్నాడు. అవి కూడా బాగా కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్‘ పూర్తిగా భిన్నమైన సినిమాను చేశాడు. అది ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఏనేపథ్యం లోనే డబల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకులకు డబుల్ ఎనర్జీ ఇవ్వడానికి రామ్ రెడీ అవుతున్నారు.ఈ నేపథ్యంలో వరంగల్‌లో డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పాటు నిర్మాత ఛార్మి, హీరో రామ్ పోతినేని, హీరోయిన్ కావ్య థాపర్, ఇతర నటీనటులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఆసక్తికర సినీ విశేషాలు చెప్పారు.

డబుల్ ఇస్మార్ట్'తో ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్నారు ఉస్తాద్ రామ్ పోతినేని. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తెలంగాణలోని వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకలో రామ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.సోషల్ మీడియాలో రివ్యూలను పట్టించుకోవద్దని ప్రేక్షకులకు రామ్ పోతినేని సలహా ఇచ్చారు. వాటి గురించి ఆయన మాట్లాడుతూ... ''ఇటీవల నేను సోషల్ మీడియాలో గానీ, బయట గానీ కొత్త ట్రెండ్ చూస్తున్నాను. 'అరే నీకు ఇది నచ్చిందా?' అంటే... 'వాళ్లకి నచ్చుతుంది ఏమో? ఇంకొకరికి నచ్చుతుంది ఏమో?' అని పక్కన ఉన్న వారివైపు చూస్తున్నారు. ముందు మనకి నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం తిన్న బిర్యానీ నచ్చిందంటే... చుట్టుపక్కల ఉన్న నలుగురు బాలేదని అంటే మన మీద మనకి డౌట్ రాకూడదు. 'నేను తిన్నాను. బావుంది' అని చెప్పాలి. అది బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరీర్ అయినా! నీకు నచ్చింది నువ్ చెయ్. పక్కనోడి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్'' అని సూటిగా చెప్పారు.పూరి గురించి రామ్ మాట్లాడుతూ... ''నా ఫోనులో పూరి గారి పేరు 'గన్' అని ఉంటుంది. హీరోలు బుల్లెట్స్ వంటి వారు. పేలిస్తే వెళతారు. నేను పూరి గన్ నుంచి ఎంత ఫోర్సుతో వస్తాననేది ఆగస్టు 15న చూస్తారు. ప్రతి నటుడికి పూరి లాంటి గన్ అవసరం. ఆయనతో పని చేస్తే వచ్చే కిక్ వేరు'' అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: