స్వగ్రామంలోని స్కూల్‌కు నాగ్ అశ్విన్ భారీ సాయం.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్..

frame స్వగ్రామంలోని స్కూల్‌కు నాగ్ అశ్విన్ భారీ సాయం.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్..

Suma Kallamadi
నాగ్ అశ్విన్ 2015లో "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో దర్శకుడిగా మారాడు. 2018లో మహానటి సావిత్రి బయోపిక్‌ "మహానటి" తీసే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత సైన్స్ ఫిక్షన్ ఫిలిం కల్కి 2898AD మూవీ డైరెక్ట్ చేసాడు చాలా హై బడ్జెట్ తో తరగతి సినిమా 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను కాబట్టి నాగ్‌ అశ్విన్ క్రేజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ ఒక్క సినిమాతో ఈ దర్శకుడు భారతదేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
నాగ్‌ అశ్విన్ మంచి దర్శకుడు మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. ఆ విషయం తాజాగా ప్రూవ్ అయింది. ఈ డైరెక్టర్ తన సొంత గ్రామంలో ఉన్న ఒక బడిలో ఎక్స్‌ట్రా రూమ్స్ తన సొంత డబ్బులతో  నిర్మించాడు. వాటిని ప్రారంభించడానికి ఇటీవల స్వగ్రామానికి వెళ్ళాడు. నాగ్ అశ్విన్ నాగర్ కర్నూల్ జిల్లా, తాడూరు మండలం, ఐతోలులో జన్మించాడు. అదే గ్రామంలో పిల్లలకు చదువుకోడానికి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పాఠశాలలో అదనపు గదులను కట్టించాడు.
వీటిని ప్రారంభించే కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తో పాటు ఎమ్మెల్యే రాజేష్ కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన చాలామంది ఈ డైరెక్టర్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పుట్టిన ఊరుని మర్చిపోకుండా వారికి తన వంతుగా సహాయం చేసిన నాగ్ అశ్విన్ ప్రశంసిస్తున్నారు. అందరూ కూడా ఇలాగే తమ సొంత ఊర్లను ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.
2024లో బుజ్జి & భైరవ అనే ఓ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ టెలివిజన్ మినిసిరీస్ నాగ్‌ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇది ఒకటే సీజన్ 2 ఎపిసోడ్స్ కలిగి ఉంటుంది. కల్కి, ఫ్రాంచైజీ ప్రపంచాన్ని పరిచయం చేయడంలో ఈ మినీ సిరీస్ సక్సెస్ అయిందని చాలామంది ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: