రామ్ కోసం బాలయ్య.. ఊర మాస్ కాంబినేషన్ రాబోతుందిగా..?

frame రామ్ కోసం బాలయ్య.. ఊర మాస్ కాంబినేషన్ రాబోతుందిగా..?

murali krishna
మన టాలీవుడ్ మాస్ స్టార్ హీరోలలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. కాగా ప్రెజెంట్ యంగ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కూడా మంచి మాస్ ఫేమ్ ఆడియన్స్ లో రూపుదిద్దుకుంది.. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కలయికలో అయితే సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ పడబోతునట్టుగా ఇప్పుడు క్రేజీ టాక్‌ చక్కర్లు కొడుతుంది.టాలీవుడ్ మల్టీ స్టార్స్ కాంబినేషన్ లో సినిమాలు తెరకెక్కడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. గత కొంత కాలంగా ఈ ట్రెండ్ అనేది ఇండస్ట్రీలో కొనసాగుతునే ఉంది. పైగా సినీ ప్రేక్షకులు కూడా ఇలాంటి కాంబో సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోల కలిసి ఒకే సినిమాలో కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని డిజాస్టార్ గా మిగిలిన, మరీ కొన్ని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మరీ, అలాంటి వాటిలో రాజమౌళి తెరకెక్కించిన బహుబలి, ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కి రికార్డులను తిరగరాశాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు మరో స్టార్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అయితే ఈ కాంబోలో మాస్ హీరోగా ఇండస్ట్రీలో పేరు పొందిన రామ్ పోతినేనితో పాటు ఓ సీనియర్ స్టార్ హీరో కలయికలో రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

బాలయ్య, రామ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు పడుతున్నాయని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. బాలయ్య, రామ్ కాంబోలో నిజంగా సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.అయితే స్టార్ హీరో బాలయ్య నిజంగానే భారీ మల్టీస్టారర్ కు ఓకే చెబుతారా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. స్టార్ హీరోల మల్టీస్టారర్ల గురించి వార్తలు ప్రచారంలోకి రావడం కొత్తేం కాదు. అయితే ఈ ప్రాజెక్ట్స్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్తాయో చూడాల్సి ఉంది.కథ ఎంతో అద్భుతంగా ఉంటే తప్ప టాలీవుడ్ స్టార్స్ మల్టీస్టారర్స్ కు ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. బాలయ్య, రామ్   కాంబో వార్తలు నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ఈ సినిమాకు ఓకే చెబితే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య ఇంకా ఈ సినిమా కథ వినాల్సి ఉందని భోగట్టా. బాలయ్య త్వరలో అఖండ2  మూవీ షూట్ తో బిజీ కానున్నారు.ఇక ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఒకవేళ నిజం అయితే మాస్ ఆడియెన్స్ కి వీరి కాంబినేషన్ క్రేజీ ట్రీట్ ని డెఫినెట్ గా అందిస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు కొల్లి బాబీతో తన 109వ సినిమాలో బిజీగా ఉండగా రామ్, దర్శకుడు పూరీ జగన్నాధ్ తో చేసిన మాస్ సీక్వెల్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: