టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. సినిమాల వర్క్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఎక్స్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించారు.క్రేజీ ప్రాజెక్టుల్లోని పాటలు ఎప్పుడు విడుదలవుతాయో చెప్పారు. హర్మోనియం కావాలని ఒకరు, మ్యూజికల్ కీ బోర్డు కావాలని అడగ్గా.. ఇస్తానని చెప్పారు. 'డైరెక్ట్ మెసేజ్' ద్వారా చిరునామా వివరాలు పంపమన్నారు.ఇక ఇప్పుడు ఇలా టాలీవుడ్ లో ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్న సినిమాలలో అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ తో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్తమన్ ఇటీవల ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయా మూవీ లో నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలతో బిజీగాఉన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే .. పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ తో సాహో సినిమా చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహో సినిమా టాక్ ఎలా ఉన్న డార్లింగ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఓజీ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కు తమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ఈ వీడియోలో మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.
దాంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ మ్యూజిక్ కు రకరకాల వీడియోలు చేస్తున్నారు.దాంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఓజీ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది.ఇకపాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ముఖ్యంగా అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే సినిమాలా రాబోతున్న పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. ఇటీవల వచ్చిన గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తను ఈ సినిమా మొదటి పాట వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేసాడు. సో రాజా సాబ్ పాట వినాలి అంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.విషయానికొస్తే .. 'ఓజీ' ఫస్ట్ సింగిల్ ఎప్పుడొస్తుంది?అని అడగ్గా తమన్ ఇలా సమాధానమిచ్చారు.నేను, డైరెక్టర్ సుజీత్ ఆ పనిలోనే ఉన్నాం. అతి త్వరలోనే రావొచ్చు.'రాజాసాబ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడు? 2025 జనవరి నుంచి 'రాజాసాబ్' పాటల ప్రచారాన్ని మొదలుపెడతాం.అని అన్నారు.