సూర్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..!?

Anilkumar
పాన్‌ ఇండియా లెవెల్‌లో హీరో సూర్యకు ఉన్న స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇదిలవుండగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి.  యాక్షన్ ఎంటర్టైనర్ గా

 తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీం. అక్టోబర్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.  ఈ మేరకు సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. 'డియర్ ఆల్.. అక్టోబర్ 10న వస్తోంది' అనే సింపుల్ క్యాప్షన్‌తో కంగువ రిలీజ్ డేట్‌ని ప్రకటించాడు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త

 పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్‌లో సూర్య ఓ వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని.. మరోవైపు స్టైలిష్ లుక్‌లో మ్యాజిక్‌ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.. కంగువలో దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.  కంగువ ఈ ఏడాది అతిపెద్ద. అత్యంత ఖరీదైన చిత్రం. 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో, ఇది పుష్ప, సింగం, అనేక ఇతర పెద్ద చిత్రాల కంటే పెద్దది. అంతేకాకుండా, భారతదేశంలోని వివిధ ఖండాలలోని 7 వేర్వేరు దేశాలలో ఈ చిత్రం చిత్రీకరించబడింది. ఇది చరిత్రపూర్వ కాలాన్ని చూపించే చాలా ప్రత్యేకమైన చిత్రం కాబట్టి మేకర్స్ చాలా నిర్దిష్టమైన రూపాన్ని దృష్టిలో ఉంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: