కల్కిలో కృష్ణుడిగా కనిపించింది ఇతడేనా.. ఆయన గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి. ఐతే నిన్న ఈ సినిమా విడుదల అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తుంది. అంతలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తెరపై ఎంతో అద్భుతంగా ఆ సన్నివేశాలను చూపించాడు దర్శకుడు. ఇక అందులో కురుక్షేత్రం ఎపిసోడ్ మాత్రం అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి.  పబ్లిక్ నుండి ఈ పార్ట్ కి విశేషమైన స్పందన లభిస్తుంది. అయితే ఈ ఎపిసోడ్లో అర్జునుడి గా విజయ్ దేవరకొండ కనిపించాడు. కృష్ణుడిగా ప్రభాస్

 అశ్వద్ధామ గా అమితాబచ్చన్ నటించిన శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కూడా ఉంది. ఇక ఆ క్యారెక్టర్ మాత్రం రెవీల్ చేయలేదు. రివిల్ చేయకుండానే నాగ్ అశ్విన్ ఎపిసోడ్ ను అత్యద్భుతంగా స్క్రీన్ పై డిజైన్ చేశాడు .అయితే ఆ మాస్క్ వెనక శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ఎవరు అని పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఆ క్యారెక్టర్ చేసిన నటుడు ఎవరు అన్న విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ఆ నటుడు పేరు కృష్ణ కుమార్. తమిళ్ యాక్టర్ కృష్ణ కుమార్ అలియాస్ కేకే. ఇతను తమిళం లో యాక్టర్ గా,

 యాక్టింగ్ ట్రైనర్ గా ఉన్నారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. కల్కి లాంటి ఎపిక్ సినిమాలో తనకి అవకాశం కల్పించిన నాగ్ అశ్విన్ కి కృష్ణ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ అవుతోంది. కృష్ణ కుమార్ సూర్య సూరరై పొట్రు సినిమాలో విమానం కెప్టెన్ గా కనిపించాడు. అయితే బలమైన గుర్తుండిపోయే పాత్రలు ఇప్పటి వరకు చేయలేదు. కల్కి సినిమాలో కృష్ణ కుమార్ లుక్ రివీల్ కాకపోయిన అతని బాడీ లాంగ్వేజ్ తోనే పెర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. అందుకే కృష్ణుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరా అని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. మొత్తానికి కల్కి తో గుర్తుండిపోయే పాత్రలో నటించాడు కృష్ణ కుమార్. ఇందులో భాగంగానే ఆయనకు ఇప్పుడు మంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: