కల్కి 2898 AD : 24 గంటల్లో బుక్ మై షో లో రికార్డు సృష్టించిన కల్కి..!

Pulgam Srinivas
నిన్న ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు దాదాపు నాలుగు రోజుల ముందే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ బుక్ మై షో లో అందుబాటులోకి వచ్చాయి. దానితో ఈ సినిమా విడుదలకు ముందు నాలుగు రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన 1.7 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో సేల్స్ అయ్యాయి. ఇక నిన్న ఈ మూవీ విడుదల కావడం , విడుదల అయిన మొదటి షో కే ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా రావడంతో నిన్న ఒక్క రోజే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో 1.12 మిలియన్ సేల్స్ జరిగాయి.

ఇలా ఈ సినిమా 24 గంటల సమయం లోనే బుక్ మై షో లో 1.12 మిలియన్ సేల్స్ జరుపుకొని అద్భుతమైన రికార్డ్ ను సృష్టించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో మరో వారం , పది రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో భారీ ఎత్తున సేల్స్ జరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే ఈ మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కమల్ రెండే సన్నివేశాలలో కనిపించినా కూడా వాటితోనే ఈయన అద్భుతమైన ఇంపాక్ట్ ను సృష్టించాడు. ఇక అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దిశ పటానీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. ఈమె పాత్రకు ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో ఈమె కూడా ఈ మూవీ లో బాగానే నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: