కల్కి ఎఫెక్ట్ రాజమౌళికి వరమా.. శాపమా..!?

Anilkumar
బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డుని దక్కించుకున్నాడు. బాహుబలి అర్ అర్ అర్  వంటి బిగ్గెస్ట్ సినిమాలను చేయడం కేవలం రాజమౌళి కే సాధ్య మన్నంత ప్రూఫ్ చేశాడు రాజమౌళి. ఇక ఆ సినిమాల తర్వాత రాజమౌళి ని ఆదర్శంగా తీసుకున్న చాలా మంది దర్శకులు ఆయన దారిలోనే వెళుతున్నారు. లేటెస్ట్ గా కల్కి సినిమా చూశాక ఇదే విషయాన్ని ప్రూఫ్ చేశాడు. రాజమౌళి కి గట్టి పోటీని ఇస్తూ కల్కి సినిమాతో ప్రేక్షకుల

 ముందుకు వచ్చాడు డైరెక్టర్. ఇదివరకే డైరెక్టర్ గా భారీ గుర్తింపుని సంపాదించుకున్న ఆయన నిన్న కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మొదటి రోజు నుండి కల్కి సినిమా బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు రాజమౌళికి కల్కి రూపంలో నాగ అశ్విన్ పెద్ద సవాలే విసిరాడు అని చెప్పొచ్చు. కల్కి తర్వాత ఇంతటి పెద్ద సినిమా ఇంతటి అద్భుతమైన సినిమా ఏ డైరెక్టర్ చేయలేరు అని కల్కి సినిమా చూశాక అందరూ రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కల్కి ఎఫెక్ట్ పూర్తిగా రాజమౌళి మహేష్ బాబు సినిమా పై

 పడింది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే.. ఇప్పటివరకు రాజమౌళి సినిమాలతోనే ఒక గొప్ప గ్రాండియర్ ఎక్స్ పీరియన్స్ చూసిన తెలుగు ఆడియన్స్ ఇక మీదట నాగ్ అశ్విన్ సినిమాలను కూడా పట్టించుకునేలా చేశాడు. ఇలాంటి టైం లో నాగ్ అశ్విన్ ని దాటేలా రాజమౌళి సినిమా చేయాల్సి ఉంటుంది. ఇద్దరు తెలుగు దర్శకులే ఇద్దరి మధ్య పోటీ ఏంటని అనుకోవచ్చు. ఇది పోటీ కాదు ఎవరికి వారికి వాళ్ల మీద ఉన్న నమ్మకం. కచ్చితంగా రాజమౌళి మహేష్ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా కల్కి చూశాక రాజమౌళి తన సినిమా గురించి మరింత కేర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కల్కి ఎఫెక్ట్ కచ్చితంగా రాజమౌళి సినిమాపై ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: