తమిళ సీనియర్ స్టార్ హీరో సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో.ఇక వయస్సు మళ్లిన తర్వాత సపోర్టింగ్ రోల్స్ తో ఇరగదీస్తున్నారు. బాహుబలి లో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు సత్యరాజ్.తమిళ నటుడైనా కూడా ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి ఎంతగానో మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యారు. ఇక బాహుబలి మూవీతో కట్టప్పగా ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి ఎవరకి పెద్దగా తెలీదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు ఇంకా కూతురు ఉన్నారన్న విషయం చాలామందికి కూడా తెలీదు.
ఇప్పటికే ఆయన కొడుకు సిబిరాజ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మాయోన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆయన కూతురు విషయానికి వస్తే ఆమె పేరు దివ్య సత్యరాజ్. ప్రస్తుతం ఆమె హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషియన్‌గా తన కెరీర్ కొనసాగిస్తుంది. స్టార్ నటుడి కూతురు అయినా కానీ ఆమె మీడియాలో మాత్రం పెద్దగా కనిపించదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ నెటిజన్లకు హెల్త్, లైఫ్ స్టైల్‌పై సలహాలు ఇంకా సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలు బయటకు రావడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఆయితే ఆమెకు పాలిటిక్స్‌పై కూడా ఇంట్రస్ట్ ఉంది.. అందుకే త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.