కల్కి అద్భుతం.. శభాష్ నాగ్ అశ్విన్.. రికార్డులు పక్కా?

Purushottham Vinay
దేశావ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "కల్కి 2898 AD". రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఫాంటసీ సినిమా ఇది.మరో ఐదు రోజుల్లో థియేటర్ లలోకి రాబోతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్య వదిలిన ట్రైలర్ లో కథేంటనేది పెద్దగా రివీల్ చెయ్యకపోయినా కానీ అందులోని విజువల్స్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ లో అధ్బుతమైన యాక్షన్ సీన్స్ తో పాటుగా కథ గురించి కూడా కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది.'కల్కి 2898 AD' మూవీ అనేది హిందూ పురాణాల స్ఫూర్తితో తీసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా. ఫ్యూచర్ వరల్డ్ ను ఊహించి యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించారు. 


హాలీవుడ్ సినిమాల్లో భవిష్యత్ నగరాలు ఎలా ఉంటాయో చూపిస్తే, ఈ మూవీలో కాశీ లాంటి చారిత్రాత్మక భారతీయ నగరాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కథంతా కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు నగరాల మధ్య సాగుతుందని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. అందుకు తగ్గట్టుగానే కథను మూడు ప్రపంచాలకు లింక్ చేస్తూ రిలీజ్ ట్రెయిలర్ ను సూపర్ గా కట్ చేశారు.మొత్తానికి 'కల్కి 2898 AD' రిలీజ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేసింది. భారీ కాన్వాస్ లో హాలీవుడ్ మూవీస్ కు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక విజువల్ వండర్ ను ఆవిష్కరించబోతున్నట్టు రిలీజ్ ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. అందులో కూడా కల్కి కథను మన హిందూ పురాణాలకు లింక్ చేస్తూ, భవిషత్ ప్రపంచాన్ని సృష్టించిన డైరెక్టర్ విజన్ ను, దాన్ని ప్రజెంట్ చేసిన తీరును కచ్ఛితంగా మెచ్చుకొని తీరాల్సిందే. బిగ్ స్క్రీన్ మీద 3డీలో ఈ సినిమా చూస్తే, ప్రేక్షకులకు ఖచ్చితంగా సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనిపిస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: