నెటిజన్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శృతిహాసన్... ఇడ్లీ, సాంబార్ అంటే ఊరుకునేదేలే అంటూ ఫైర్..!

lakhmi saranya
స్టార్స్ బ్యూటీ శృతిహాసన్ ఇటీవల సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ సినిమాలే కాకుండా సింగర్ గాను పలు పాటలు పాడుతూ సత్తా చాటుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది శృతిహాసన్. అంతేకాకుండా చిట్ చాట్ పెట్టి అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తుంది.
ఇక తాజాగా శృతిహాసన్ ను ఓ నెటిజన్ సౌత్ ఇండియన్ యాస లో ఏదైనా చెప్పవా అని అడిగాడు. ఇక దానికి శృతిహాసన్ స్పందించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. " ఓకే ఈ రకమైన జాతి వివక్షను అసలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్, దోస.. ఇటువంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోము. మీరు మమ్మల్ని అనుకరించలేదు. కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము.
సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా. నోరు మూసుకుని వెళ్ళు " అని తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఇటీవల జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుక్ ఖాన్.. రామ్ చరణ్ ను ఇడ్లీ వడ అని పిలిచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై తెలుగు ఆడియన్స్ షారుక్ ఖాన్ ని ఏకేశారు. అలాగే చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ కూడా ఫైర్ అవుతూ అంత పెద్ద స్టార్ ను అలా పిలవడం ఏంటని ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇక శృతిహాసన్ కి ఈ ఘటన గురించి తెలుసు కాబట్టి అందుకే ఈ విధంగా స్పందించిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ సినిమాలే కాకుండా సింగర్ గాను పలు పాటలు పాడుతూ సత్తా చాటుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: